HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా ఈనెల 27న పారామిలిటరీ బలగాలు వస్తున్నాయని పోలీస్ అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 8 కంపెనీల పారా మిలిటరీ బలగాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పనిచేస్తాయని, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారా మిలిటరీ బలగాలు విధుల్లో ఉంటాయన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు.