AP: హర్యానాలో జరిగిన 16వ అఖిల భారత పోలీస్ కమాండో పోటీల్లో రాష్ట్ర పోలీసు కమాండో దళం నాలుగు ప్రతిష్టాత్మక పతకాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండో జట్లు సమష్టిగా ఈ ట్రోఫీలు గెలుచుకున్నాయి. దేశంలోనే ఉత్తమ పోలీసు కమాండో జట్టు, బ్లాక్ హాక్, రణనీతి ట్రోఫీ, కాంస్య పతకం సాధించాయి. ఈ పోటీల్లో అన్ని రాష్ట్రాల పోలీసు, కేంద్ర సాయుధ బలగాలు పాల్గొన్నాయి.