SRPT: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఇవ్వాళ నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పీఆర్వో వెంకటరెడ్డి తెలిపారు. ఉదయం 09:30 గంటలకు చిలుకూరు మండలం, కోదాడ పట్టణంలోని పలు వివాహ శుభకార్యాలకు ఆమె హాజరవుతారు. ముఖ్యంగా 10:30 గంటలకు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు.