KMM: జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో శనివారం న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద, జస్టిస్ కె.శరత్ ప్రారంభించారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో స్నేహపూర్వకంగా వివాదాలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు.