AP: గ్యాస్ ధర పెంపును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. వంట గ్యాస్ సిలిండర్‌కు రూ.60, వాణిజ్య సిలిండర్‌కు రూ.115 చొప్పున పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షల కారణంగా ఈ ధరల పెంపు ప్రజలకు భారంగా మారుతుందని అన్నారు.