Pushpa2 Movie: ‘పుష్ప 2’ ఐటెం బ్యూటీ.. ఇదే క్లారిటీ!
సోషల్ మీడియా టాక్ ప్రకారం పుష్ప2లో రోజుకో కొత్త క్యారెక్టర్ యాడ్ అవుతోంది. మేకర్స్ అఫిషీయల్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా.. నెట్టింట్లో మాత్రం ఫలానా హీరోయిన్, హీరో కీ రోల్ ప్లే చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప ఐటమ్ బ్యూటీ ఫిక్స్ అయిపోయింది.. ఇప్పటికే అమ్మడు షూటింగ్ సెట్లో ల్యాండ్ అయిపోయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీని పై క్లారిటీ ఇచ్చేసింది ఆ హాట్ బ్యూటీ.
పుష్ప సినిమా(Pushpa Movie)లో సమంత(Samantha) చేసిన ‘ఊ అంటావా..’ ఐటెం సాంగ్ ఇప్పటికీ హాట్ గానే ఉంటుంది. పార్ట్ వన్‌కే ఇలా ఉంటే.. సెకండ్ పార్ట్‌లో వచ్చే ఐటెం సాంగ్(Item song) ఇంకే రేంజ్లో ఉంటుందోనని ఊహించుకుంటున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్(Actress Seerath kapoor) పెట్టిన ఒక పోస్ట్.. పుష్ప2(Pushpa2) ఐటమ్ సాంగ్ గురించేనని ఫిక్స్ అయిపోయారు. అల్లు అర్జున్‌కు టైట్ హగ్ ఇచ్చిన ఫొటోని సీరత్ కపూర్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టే చేసింది. దానికి క్యాప్షన్‌గా డాన్సర్స్‌కి ఎగిరేందుకు రెక్కలు అక్కర్లేదు.. వారి ఎనర్జీనే లీడ్ చేస్తుంది అంటూ రాసుకొచ్చింది. దాంతో పుష్ప2 ఐటెం పాప ఈమెనే అని అనుకున్నారు.
అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. ‘పుష్ప 2′(Pushpa2)లో తాను కూడా ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు.. అని క్లారిటీ ఇస్తున్నాను. అల్లు అర్జున్ తనకు మంచి ఫ్రెండ్. ఇటీవల ఆయనను కలిసి కాసేపు మాట్లాడాను.. ఓ ఫోటో తీసుకున్నాను. అంతే తప్ప.. ఆయన సినిమాలో నటించడం లేదు. ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయడం లేదని’ అని సీరత్ కపూర్(Actress Seerath kapoor) ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశారు. దీంతో పుష్ప 2 ఐటెం బ్యూటీ ఎవరనే చర్చ మళ్లీ మొదలైంది. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి.
అందులో దిశా పటాని పేరు బాగా వినిపిస్తోంది. ఎందుకంటే పార్ట్ వన్‌లో ముందుగా దిశానే ఐటెం సాంగ్ కోసం అనుకున్నారు. కానీ ఎందుకో సమంత లైన్లోకి వచ్చింది. దాంతో సెకండ్ పార్ట్‌లో దిశా పటాని ఐటెం సాంగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే.. సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పుష్ప2(Pushpa2) మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో పుష్ప2 రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.