ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ చూసి పండగ చేసుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు పవర్ స్టార్. వాటిలో ఓజి స్పీడ్ చూస్తుంటే.. మరీ ఇంత స్పీడ్ ఏంటి మావా? అనేలా ఉంది. బుల్లెట్ కంటే ఫాస్ట్‌గా దూసుకుపోతోంది ఓజి షూటింగ్.
ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ‘ఓజి’ తెరకెక్కుతోంది. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. సాహో తర్వాత ఏకంగా పవర్ స్టార్‌తో ఛాన్స్ కొట్టేశాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. ఈయన పవన్ ఫ్యాన్ కావడంతో.. ఒక అభిమానిగా ఓజి ఎలివేషన్‌ను ఓ రేంజ్లో ఊహించుకుంటున్నారు అభిమానులు. ముంబై గ్యాంగ్ వార్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఓజి ముంబై షెడ్యూల్ కంప్లీట్ చేసేశారు. ఇక ఇప్పుడు Drama, Action, Love and Melody… A power-packed long schedule is now wrapped up! అంటూ డీవివి సంస్థ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ సందర్భంగా పవన్ వాకింగ్ స్టిల్ ఫోటో ఒకటి రిలీజ్ చేశారు.
అందులో బ్లూ షర్ట్, బ్లాక్ గాగుల్స్, లైట్ బియర్డ్‌తో పవన్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపించాడు. ఇంతకుముందు కూడా ముంబై షెడ్యూల్ కంప్లీట్ అయిన సమయంలో.. ఇలాంటి ఫోటోనే షేర్ చేశారు. అస్సలు ఈ ఒక్క ఫోటో అనే కాదు.. డివివి ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఫ్యాన్స్ ఏది అడిగితే అది ఇస్తున్నారు. అంతెందుకు రంజాన్ రోజున పవన్ ఫ్యాన్‌కు ఏకంగా బిర్యానీ పంపించి సర్ప్రైజ్ చేశారు. ఈ లెక్కన ఓజిని ఇప్పటి నుంచే ఎలా ప్రమోట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల్లో ఓజి పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు పవన్. త్వరలోనే హరిహర వీరమల్లుని కూడా కంప్లీట్ చేయనున్నాడు. మరో వైపు వినోదయ సీతమ రీమేక్ బ్యాలెన్స్ షూటింగ్ జరుగుతోంది. ఏదేమైనా.. ఈ సినిమాల్లో ఓజిదే ఓవర్ స్పీడ్ అని చెప్పొచ్చు.