»Those Four People Are Based On Vijay Devarakonda Kushi Movie Result
Kushi: నలుగురికి ‘ఖుషి’ సినిమానే దిక్కు!
విజయ్ దేవరకొండ(vijay devarakonda) నటిస్తున్న ఖుషి సినిమా(Kushi movie) పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న నలుగురు మెయిన్ పిల్లర్స్‌కు ఈ సినిమా రిజల్ట్ ఎంతో కీలకంగా మారింది. ఈ సినిమా రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా.. వాళ్ల పరిస్థితి చెప్పుకోలేని విధంగా ఉంటుంది. మరి ఖుషి ఏం చేయబోతోంది?
సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. సమంత(samantha) హీరోయిన్గా నటిస్తోంది. అయితే విశేషమేంటంటే.. ఈ సినిమా డైరెక్టర్, నిర్మాతలే కాదు.. హీరో, హీరోయిన్లు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు.
లైగర్(liger) సినిమాతో ఘోర పరాజయాన్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ తర్వాత సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఖుషి సినిమా చేస్తున్నాడు రౌడీ. ఇక స్టార్ బ్యూటీ సమంత కూడా ఇటీవల శాకుంతలం సినిమాతో డిజాస్టర్ అందుకుంది. అస్సలు ఈ సినిమాలో సమంత ఫేస్‌లో గ్లో మిస్ అయిందనే కామెంట్స్ మూటగట్టుకుంది. కానీ ఖుషి సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్‌లో సమంత బ్యూటీకి మంచి మార్కులే పడ్డాయి.
ఈ సినిమాతో సామ్ ‘ఖుషి(kushi)’ అవాలని చూస్తోంది. ఇక డైరెక్టర్ శివ నిర్వాణ చివరగా టక్ జగదీష్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ఈ సినిమా నిర్మాణం సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు కూడా ఖుషి ఇంపార్టెంట్‌గా మారింది. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో హిట్ అందుకున్న మైత్రీ వారు.. ఆ తర్వాత అమిగోస్, మీటర్ సినిమాలతో సక్సెస్ కొట్టలేకపోయారు.
అందుకే ఈ నలుగురికి ఖుషి సినిమానే ఇప్పుడు దిక్కుగా మారింది. భారమంతా ఖుషి పైనే వేసి.. ప్రస్తుతం కేరళ(kerala)లో షూటింగ్‌తో బిజీగా ఉంది ఖుషి టీమ్. మొత్తంగా ఈ మూవీ రిజల్ట్ పై నలుగురు ఫ్యుచర్ ప్రాజెక్ట్స్ ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఖుషి నలుగురిని ఖుషీ చేస్తుందేమో చూడాలి.