MLG: వెంకటాపురం మండలంలోని తిప్పాపురం గ్రామ శివారులో పోలీసులు మంగళవారం కోడి పందేల స్థావరంపై దాడులు చేపట్టారు. ఈ దాడులలో నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద 4000 రూపాయల నగదు, మూడు కోడిపుంజులు, 8 కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 26 ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని పారిపోయిన వారిని సైతం పట్టుకుంటాం అని పోలీసులు తెలిపారు.