PDPL: రాజకీయాలను శాసించే స్థాయికి యాదవులను సంఘటితం చేస్తామని ఉమ్మడి కరీంనగర్ యాదవ సంఘాల కన్వీనర్ సౌగాని కొమురయ్య అన్నారు. ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభా పరంగా 22 శాతం యాదవులున్నారని, కానీ రాజకీయ అవకాశాలు మాత్రం ఆ స్థాయిలో లభించడం లేదన్నారు. ఈనెల 24న KNR వద్ద యాదవులకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.