NLR: టీడీపీ యువనేత మాలేపాటి భానుచందర్ అకాల మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన లేని లోటు దగదర్తి తెలుగుదేశం పార్టీకి లోటని కావలి కావ్య కృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. భాను అకాల మరణం సందర్బంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. రెండు నిముషాలు పాటు మౌనం పాటించారు. వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.