KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదివారం HYDలో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సల్మాన్ ఖుర్షిద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు పాల్గొన్నారు.