లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్.. కోలీవుడ్ నుంచి బాహుబలి రేంజ్లో వచ్చింది. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. కానీ ఫస్ట్ పార్ట్ ఊహించినంత స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అయితే పాన్ ఇండియా లెవల్లో ఆడకపోయినా.. తమిళ్లో మాత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాదాపు 500 కోట్లు రాబట్టింది. దాంతో సెకండ్ పార్ట్(Ponniyin Selvan2)తో వచ్చేదంతా లాభమే అంటున్నారు.
హిట్ రికార్డ్ ఉన్న డేట్ ఏప్రిల్ 28న చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది పోన్నియన్ సెల్వన్ 2(Ponniyin Selvan2). ఆ రోజు తెలుగు నుంచి రిలీజ్ అయినా అఖిల్ ‘ఏజెంట్’ మూవీ ఫ్లాప్ అయింది. దాంతో తెలుగులో పీఎస్ 2నే పోయిన వారం థియేటర్ ఆప్షన్‌గా మారింది. కానీ ఈ సినిమా పై ఇక్కడ పెద్దగా బజ్ లేదు. అయితే కోలీవుడ్‌లో మాత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు.. అంటే పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ప్రకటించారు మేకర్స్. కేవలం తమిళ్లోనే రూ.130 నుంచి రూ.140 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది.
హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో.. ఈ సినిమా రూ.25 నుంచి రూ.30 కోట్లు వసూలు చేసినట్టు టాక్. ఓవర్సీస్లో రూ.130 కోట్ల భారీ వసూళ్లు సాధించిందని అంటున్నారు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల్లో రూ.300 కోట్లు(300 crore club) రాబట్టింది. దీంతో ఈ సినిమాకు భారీ లాభాలు వచ్చినట్టేనని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే.. ఫస్ట్ పార్ట్‌తోనే మేకర్స్ పెట్టిన ఖర్చు వెనక్కి వచ్చేసింది.
దాంతో PS 2తో వచ్చేదంతా లాభమే. పొన్నియిన్ సెల్వన్‌లో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తీ, త్రిష, జయం రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. ప్రముఖ తమిళ రచయిత కల్కీ రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. మరి లాంగ్ రన్లో పీఎస్ 2 ఎంతవరకు రాబడుతుందో చూడాలి.