పాకిస్థాన్-ఆఫ్గానిస్థాన్ శాంతి చర్చలు విజయవంతం. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో దోహాలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత శాశ్వత శాంతి కోసం ఈ ఒప్పందం కుదిరిందని ఖతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది. భవిష్యత్తులో స్థిరత్వం కోసం మరిన్ని చర్చలకు ఇరుదేశాల రక్షణ మంత్రులు అంగీకరించారు.