సత్యసాయి: రామగిరి మండలం పోలేపల్లిలో జరిగిన మహర్షి వాల్మీకి జయంతోత్సవంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మానవజాతికి ధర్మం, న్యాయం, సత్యం విలువలను అందించిన మహర్షి వాల్మీకి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆయన చూపిన మార్గంలో నడిచి మానవతా విలువలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు.