MBNR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఎన్నికల హామీని త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ నాయకులు జాయింట్ కలెక్టర్ మధుసూధన్ నాయుక్కు వినతిపత్రం అందజేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు, దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి శాశ్వత రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.