PLD: నాగార్జునసాగర్ పర్యటన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ మహమ్మద్ నజీర్‌కు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శనివారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గవర్నర్ సాగర్, నాగార్జునకొండ, అణుపు, ఎత్తిపోతల వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు.