సత్యసాయి: రామగిరి మండలం పోలేపల్లిలో ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ సమీపంలోని పంట పొలాలు, హంద్రీనీవా జలాలతో నిండిన పోలేపల్లి సాగునీటి చెరువును పరిశీలించారు. రైతులకు సాగునీరు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హంద్రీనీవా నీటితో పొలాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.