కోనసీమ: మండపేటలోని ఆపిల్ స్కూల్లో దీపావళి ముందస్తు వేడుకలు పాఠశాల కరస్పాండెంట్ బలుసు ప్రజ్ఞ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రజ్ఞ మాట్లాడుతూ.. ప్రతి సమాజంలో ప్రతి పండగకు ఒక ప్రత్యేకత ఉంటుందని పేర్కొన్నారు. దీపావళిని చెడుపై మంచి గెలిచిన సందర్భంగా జరుపుకుంటామని తెలిపారు. బాణాసంచా కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.