పంజాబ్ గరీబ్‌రథ్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిర్హింద్ స్టేషన్ సమీపంలో రైలులో మంటలు చెలరేగాయి. కోచ్ నెంబర్ 19లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన లోకో ఫైలట్ రైలును ఆపివేశారు. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రైలు లూథియానా నుంచి ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం.