సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధి పనులు మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్నాయి. సోమందేపల్లి మండలం సుద్దకుంటపల్లి–జూలకుంట గ్రామాల మధ్య రూ.1.50 కోట్ల వ్యయంతో నూతన రహదారి పనులు పూర్తయ్యాయి. ఎన్నడూలేని విధంగా ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.