ప్రకాశం: చంద్రశేఖరపురం మండల పరిధిలో ఎక్కడైనా అక్రమంగా బాణసంచా తయారు చేసినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేశ్వర నాయక్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దీపావళి నేపథ్యంలో లైసెన్స్ లేకుండా షాపులు పెట్టవద్దని సూచించారు. కాగా, పేలుడు పదార్థాలు నిల్వ చేసే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు.