మామూలుగా మన తెలుగు ఇండస్ట్రీలో హీరో అంటే ఎలా ఉండాలి.. ఆరడుగుల ఎత్తు.. కండలు తిరిగిన దేహం.. అందానికే అందం అనేలా ఉండాలి. హీరో ఫేస్‌లో ఏ లోపం ఉన్నా సరే.. ఇక్కడ వర్కౌట్ కాదు కదా.. అసలు అవకాశాలే రావు. కానీ కోలీవుడ్‌లో అలా కాదు.. మొదటి నుంచి అక్కడ హీరోల అందం కంటే.. నటన పరంగానే ఎక్కువగా ఆదరిస్తారు.
ఇప్పటికే విజయ్ కాంత్, రజనీ కాంత్, ధనుష్ లాంటి హీరోలు.. తమదైన ఫర్ఫార్పెన్స్, అండ్ స్టైల్‌తో దుమ్ముదులుపుతున్నారు. క్రియేటివిటి ఉంటే చాలు.. ఆటోమేటిక్‌గా జనాలు ఆదరిస్తారని తమిళ్ హీరోలు ప్రూవ్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే నిరూపించాడు ఓ కుర్రాడు. కటౌట్ కాదు.. సాలిడ్ కంటెంట్ ఉంటే చాలు.. అని నిరూపించాడు. అతనే ప్రదీప్ రంగనాథన్.
అసలు ఈయనను చూస్తే.. హీరో ఛాయలు ఎక్కడా కనిపించవు. ఈయన గనుకగ టాలీవుడ్ ఆఫీస్‌ల చుట్టూ.. లవ్ టుడే కథను పట్టుకొని.. తనే హీరోగా చేస్తానని తిరిగి ఉంటే… కనీసం గేట్ దరిదాపుల్లోకి కూడా మనోళ్లు రానిచ్చి ఉండేవారు కాదు. పైగా అద్దంలో మొహం చూసుకో అని.. హెళన చేసే వారు. కానీ కోలీవుడ్‌లో తనదైన నటన.. దర్శకత్వ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు ప్రదీప్ రంగనాథ్. ఇప్పటికే తమిళ కుర్రాకారును ఊపెస్తున్న ప్రదీప్.. ఇప్పుడు తెలుగు యూత్‌కు కూడా దగ్గరయ్యాడు.
ఈయన నటించి, దర్శకత్వం వహించిన ‘లవ్ టుడే’ అనే సినిమా ఈ వారమే థియేర్లోకి వచ్చింది. తమిళ్లో నవంబర్ 4న విడుదలైన ఈ సినిమా.. అక్కడ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు కోట్ల బడ్జెత్‌తో నిర్మించిన ఈ సినిమా.. ఇప్పటికే 70 కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది. అందుకే ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లో నవ్వులే నవ్వులు అంటున్నారు ఆడియెన్స్. అంతేకాదు.. ట్రెండ్‌కు తగ్గట్టుగా రాసుకున్న మొబైల్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ అదరహో అంటున్నారు.