KMM: దళారుల సమస్యకు చెక్ పెట్టేలా రైతులే నేరుగా స్లాట్ బుక్ చేసుకుని సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కేంద్రప్రభుత్వం రూపొందించిన ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి స్లాట్ బుక్ చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు.