MHBD: బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. బీసీ సంఘాల నేతలు ఈనెల 18న నిర్వహించబోయే బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారధి రెడ్డి వెల్లడించారు. ఇవాళ మహబూబాబాద్‌లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీసీల న్యాయం కోసం సీపీఐ అండగా నిలబడుతుందని తెలిపారు.