ADB: భీంపూర్ మండలం వడూర్ గ్రామానికి చెందిన లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి గురువారం తెల్లవారుజామున సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ దత్తు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని ఆస్పత్రికి చేర్చినట్లు పైలట్ సత్యనారాయణ పేర్కొన్నారు.