GDWL: ధరూర్ మండలంలోని గుడ్డెందొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం హరితహారం మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఆదేశాలు ఇవ్వగా, అధికారులు మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. గుడ్డెందొడ్డి పంప్ హౌస్ దగ్గర హరితహారం మొక్కలు విలవిలలాడుతున్నాయి. పూర్తి మొత్తంలో ఇష్టానుసారంగా పడేయడంతో కెనాల్ దగ్గర నీరు ఉన్నా కనీసం మొక్కలకు తేమ లేదపోయిందని స్థానికులు పేర్కొన్నారు.