WGL: నర్సింహులపేట మండలం కౌసల్య దేవిపల్లి గ్రామంలోని పల్లె దవాఖాన పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఆసుపత్రి ప్రాంగణంలో గడ్డి, ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి, చెట్ల తీగలు కిటికీల గుండా గదుల్లోకి వ్యాపిస్తున్నాయి. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇవాళ కోరారు.