ప్రకాశం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కర్నూలులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కనిగిరి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, తాజా రాజకీయ పరిస్థితులను పల్లా శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వివరించారు. కర్నూలులో ఈనెల 16న ప్రధాని సభ విజయవంతం చేయడంపై చర్చించారు.