MBNR: మండలం రామ్ రెడ్డి గూడెం సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థిని ప్రియాంక(15) ఆత్మహత్య చేసుకుంది. గద్వాల జిల్లా మల్దకల్ చెందిన ఆమె, హాస్టల్ వాతావరణం సరిగా లేదని మూడు రోజుల క్రితం తల్లిదండ్రులకు చెప్పింది. వారు సోమవారం వస్తామని నచ్చజెప్పగా, అదే రోజు ఉదయం హాస్టల్ బాత్రూంలో ఉరేసుకొని చనిపోయింది.