GNTR: పొన్నూరులోని అంబేడ్కర్ కాలనీలో విద్యుత్ స్తంభం ఒరిగిపోయి ప్రమాద భరితంగా ఉంది. స్తంభం చుట్టూ సాలెగూడు లాగా విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు అల్లుకున్నాయి. అధికారులకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా స్పందన కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుకోని అవంతరాలు ఏమైనా జరిగి, ప్రాణాలు పోతే గాని అధికారులు స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు.