WGL: నగరంలో రెండు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు బల్దియా ఎస్ఈ సత్యనారాయణ తెలిపారు. ధర్మసాగర్ వద్ద మిషన్ భగీరథకు చెందిన 60 ఏంఎల్డీ మోటార్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని విలీన గ్రామాలతో పాటు అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో రెండు రోజులు నీటి సరఫరా జరగదన్నారు.