»Indian American Ajay Banga Is The New Chief Of The World Bank
Ajay Banga: ప్రపంచ బ్యాంక్ కొత్త చీఫ్‌గా ఇండియన్ అమెరికన్
ఇండియన్ అమెరికన్(indian american), మాజీ మాస్టర్ కార్డ్ CEO అజయ్ బంగా(Ajay Banga) కీలక పదవీ దక్కించుకున్నారు. ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడి(world bank president)గా అతను నియమితుడయ్యాడు. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ మేరకు ప్రకటించారు.
ఇప్పటికే పలు కీలక పదవుల్లో ఉన్న ఇండియన్ అమెరికన్స్(indian american)కు తాజాగా మరో ప్రతిష్ఠాత్మక పదవి దక్కింది. ఏకంగా ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడి(world bank president)గా భారత సంతతికి చెందిన వ్యక్తిని ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఎంపిక చేసింది. ఈ క్రమంలో జూన్ 2, 2023 నుంచి ఐదేళ్ల కాలానికి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా(Ajay Banga)ను ఎంపిక చేశారని ఈ మేరకు బుధవారం వెల్లడించారు.
ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న అభివృద్ధి సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ప్రపంచ బ్యాంక్(world bank)గ్రూప్ మిస్టర్ బంగాతో కలిసి పనిచేయడానికి బోర్డు ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు అనే రెండు అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు అధిపతి అయిన మొట్టమొదటి భారతీయ-అమెరికన్ గా అజయ్ బంగా(Ajay Banga) నిలిచారు.
మాజీ మాస్టర్ కార్డ్ CEO అయిన బంగాను.. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ పదవికి నామినేట్ చేసింది. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ బ్యాంకును నడిపించడానికి బంగా అత్యుత్తమ సన్నద్ధుడని పేర్కొన్నారు.
బంగా ప్రస్తుతం US పెట్టుబడి సంస్థ జనరల్ అట్లాంటిక్ LPలో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అంతకు ముందు అతను మాస్టర్‌కార్డ్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఒక దశాబ్దం పాటు పనిచేశారు. అతను ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి CEOగా సహా సిటీ గ్రూప్ ఇంక్.లో కూడా వివిధ పదవులను నిర్వహించారు.