KNR: హుజురాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ మండల ఎన్నికలు ఆదివారం విశ్రాంత భవన్లో జరిగినవి. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా యండీ. ఉస్మాన్ పాషా, కార్యదర్శిగా జయవర్థన్, ఆర్థిక కార్యదర్శిగా దుర్గాజీ, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.