KDP: రైల్వే కోడూరు పట్టణంలో నేరాల అదుపునకు పోలీసులు 33 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాల నియంత్రణ, పోలీసుల దర్యాప్తులో పురోగతి ఉంటుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన పట్టణ సీఐ హేమ సుందర్ రావు, ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, కానిస్టేబుళ్లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.