»Another Huge Project From Kgf Dhanush With Vetrimaaran
KGF నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఈసారి డెడ్లీ కాంబో!?
కెజియఫ్(KGF) అంటే.. కర్ణాటకలో ఉండే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. బ్రిటిష్ కాలంలో ఇక్కడ బంగారు గనులను మొత్తం తవ్వేశారు. దాంతో అప్పట్లోనే కెజియఫ్‌ను మూసి వేశారు. అయితే కెజియఫ్ పేరుతో.. కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ అనే టాలెంటెడ్ డైరెక్టర్ చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపింది. కెజియఫ్ బ్యాక్ డ్రాప్లో అల్లుకున్న ఫిక్షనల్ కథ ఇది. అందుకే ఇప్పుడు కెజియఫ్ బ్యాక్ డ్రాప్లో మరిన్ని సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ప్రస్తుతం చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇది కెజియఫ్(KGF)లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లోనే విక్రమ్ తాజాగా ప్రమాదానికి గురయ్యాడు. ఇదిలా ఉండగానే.. కోలీవుడ్ నుంచి మరో డెడ్లీ కాంబినేషన్ కెజియఫ్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోందట. తమిళ్ డైరెక్టర్స్‌లో వెట్రిమారన్(vetrimaaran) స్టైలే వేరు.
రీసెంట్గా ‘విడుదల పార్ట్ వన్’తో మంచి విజయాన్ని అందుకున్నాడు వెట్రిమారన్(vetrimaaran). రియాల్టిగా సినిమాలు చేసే ఈ డైరెక్టర్.. గతంలో ధనుష్(dhanush)తో అసురన్ లాంటి సినిమాలు చేసి జాతీయ అవార్డ్స్ అందుకున్నాడు. అందుకే మరోసారి ఈ డెడ్లీ కాంబో ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు అనుకున్న ‘వడ చెన్నై 2’ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టి మరీ.. మరి కెజియఫ్ రేంజ్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వెట్రిమారన్ కెజియఫ్ పై రీసెర్చ్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాతో కెజియఫ్‌లో జరిగిన అన్యాయాలు, అక్రమాలు కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. త్వరలోనే వెట్రిమారన్ ‘విడుదల పార్ట్ 2’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లనుందని కోలీవుడ్ వర్గాల మాట. మరి వెట్రిమారన్ కెజియఫ్(KGF)ను ఎలా చూపిస్తాడో చూడాలి.