BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో నూతన గ్రంథాలయం ఏర్పాటు చేసే అభ్యర్థులకే స్థానిక ఎన్నికల్లో మద్దతిస్తామని విన్నర్స్ యూత్ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం కమిటీ అధ్యక్షుడు చంద్రమౌళి మాట్లాడుతూ.. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమని అన్నారు. ఒక సంవత్సరంలో గ్రంథాలయం నిర్మిస్తానని హామీ ఇచ్చే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు.