యశోద సినిమా రిలీజ్‌కు ముందు తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పింది సమంత. దాంతో యశోద సినిమాపై మంచి సింపతి ఏర్పడింది. అందుకు తగ్గట్టే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ అందుకుంది సామ్. దాంతో గాల్లో తేలిపోతున్నాని చెప్పుకొచ్చింది. అయితే మళ్లీ తన హెల్త్ పై ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అమ్మడు. దాంతో ప్రస్తుతం సామ్ పరిస్థితేంటని ఆరా తీస్తున్నారు అభిమానులు.
అలాగే యశోద సినిమా ఓటిటిలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో యశోద సినిమాకు కోర్టు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నవంబర్ 11న రిలీజ్ అయిన ఈ సినిమా.. సరోగసీ సెంటర్లో జరిగే క్రైమ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈవా అనే సరోగసీ సెంటర్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అదే ఇప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది.
ఈవా అనే పేరుతో నిజంగానే ఓ హాస్పిటల్ ఉంది. వాస్తవానికి ఈవా అనే పేరును మేకర్స్ క్రియేట్ చేశారు. కానీ అదే పేరుతో ఉన్న హాస్పిటల్ని.. యశోద సినిమాలో తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని, సదరు హాస్పిటల్ యాజమాన్యం కోర్టులో కేసు వేసింది. అయితే ఇప్పటికే సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి.. డిసెంబర్ 19 వరకు యశోదను ఓటీటీలో రిలీజ్ చేయకుండా..
కోర్టు నోటీసులను జారీ చేసినట్టు తెలుస్తోంది. యశోద మూవీని డిసెంబర్ సెకండ్ వీక్‌లో ఓటిటిలోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు కోర్టు వ్యవహారంతో మరింత లేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి యశోద కోర్టు వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.