HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో HYD కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. ఈనెల 13న ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 11న పోలింగ్, 14న ఫలితాలు ఉండడం వలన ఈనిర్ణయం తీసుకున్నామని, ఫలితాల తర్వాత ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు.