BDK: దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను DD ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటగది, స్టోర్ రూమ్, డార్మెటరీ, డైనింగ్ హాల్‌ను పరిశీలించి, విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ తో పాటు మెనూ ప్రకారం సమయానుకూలంగా భోజనం అందించాలని సూచించారు.