విశాఖ: మంత్రి నారా లోకేష్ నేడు విశాఖ రానున్నారు. ఉదయం 10 గంటలకు మధురవాడలో ఐటీ సెజ్‌లో ఎస్ఐఎఫ్వై డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రామ్‌నగర్ ఎన్టీఆర్ భవన్‌కు చేరుకుంటారు. పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ మ్యాచ్‌కు హాజరవుతారు.