సత్యసాయి: బత్తలపల్లి మండలం రాఘవంపల్లికి చెందిన మహిళా రైతు గంగమ్మ ఢిల్లీలో జరిగిన ప్రధానమంత్రి ధన ధాన్య యోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె సహజ వ్యవసాయంతో పర్యావరణాన్ని కాపాడుతూ, గ్రామీణ మహిళలకు ప్రేరణగా నిలుస్తుండటాన్ని ప్రధాని ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులు ఎదుగుతారు, భారత్ అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ గంగమ్మతో అన్నారు.