AP: ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పూర్తిచేసుకున్న చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. చంద్రబాబు విజన్, సుపరిపాలన పట్ల కమిట్మెంట్ ఆయన రాజకీయ జీవితంలో స్థిరంగా సాగాయని X వేదికగా కొనియాడారు. తాను CMగా ఉన్నప్పుడూ CBNతో కలిసి పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతగానో కృషిచేస్తున్న ఆయనకు తన బెస్ట్ విషెస్ అందజేశారు.