NZB: జిల్లా పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో జిల్లా మహిళా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు చాట్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా సంఘం ప్రతినిధులు సంఘానికి సంబంధించి పలు సమస్యలను వివరించారు.