HYD: చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వే స్టేషన్లమధ్య విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో మండలరాజు(57) అనేవ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జనగామ జిల్లాలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు తెలిపారు. రాజు కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడని విచారణలో తెలిపారు.