SKLM: టెక్కలి,నందిగం,మెళియాపుట్టి మండలాల్లో శనివారం పలు మద్యం దుకాణాలలో టెక్కలి ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మద్యం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు సీఐ మీరా సాహెబ్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకు 111 నమూనాలను పరిశీలించినట్లు వెల్లడించారు. నాణ్యత లేని మద్యం విక్రయాల చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.