BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్ర వెంకటేశం IAS శనివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, అధికారులు అభిషేక లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.