PDPL: ఎలిగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 69వ ఎస్జీఎఫ్ పెద్దపల్లి జిల్లా స్థాయి అండర్-14, అండర్-17 చదరంగ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ ప్రారంభించారు. జిల్లాలోని పాఠశాలల నుండి 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చెస్ అసోసియేషన్ నాయకులు గడ్డాల శ్రీనివాస్, భాను, సతీష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.