HNK: పరకాల పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న చెరువులో చెత్తాచెదారం చేరి దుర్గంధం వ్యాపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.4 కోట్లతో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ వద్ద వ్యర్థాలు పారబోయడంతో వాకింగ్‌కు కూడా చేయలేకపోతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం స్పందించి చెరువును శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు.