కోనసీమ: రామచంద్రపురం మండలం కందుల పాలెం గ్రామైక్య సంఘానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడం పట్ల కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం హర్షం వ్యక్తం చేశారు. ఏపీఎమ్ ఎస్.శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు అవ్వారి మంగాదేవి, వీవోఏ నాగలక్ష్మి, సంఘం సభ్యులు సత్యంను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామానికి ప్రతిష్టాత్మక అవార్డు రావడం స్ఫూర్తిదాయకం అన్నారు.